మొంథా ఎఫెక్ట్ : తిరుపతి జిల్లా అరణియార్‌లో చేపల వేట నిషేధం

మొంథా ఎఫెక్ట్ : తిరుపతి జిల్లా అరణియార్‌లో చేపల వేట నిషేధం

(పిచ్చాటూరు, ఆంధ్రప్రభ) : అరణియార్ ప్రాజెక్ట్ పరిసరాల్లో రెండు రోజులపాటు చేపల వేట నిషేధం విధించారు. మొంథా (Montha) తుఫాన్ ప్రభావంతో వర్షం, ఈదురుగాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముందస్తు భద్రతా చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

పిచ్చాటూరు మండల ఎంపీడీవో మహమ్మద్ రఫీ (MPDO Mohammed Rafi) మాట్లాడుతూ… ప్రాజెక్ట్ కింద నీటి మట్టం పెరుగుతోంది. మత్స్యకారులు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదు. ప్రజల భద్రతే మా ప్రాధాన్యం. రెండు రోజుల వేట నిషేధాన్ని సమర్థించాలి. వాతావరణం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే వేట పున: ప్రారంభించాలి, అన్నారు. ప్రాజెక్ట్ ఎగువ నుంచి సుమారు 500 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దిగువకు రెండు గేట్ల ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఏఈఈ ధరణీ కుమార్ వెల్లడించారు.

Leave a Reply