కార్తీక సోమవారం..శివయ్య దర్శనం కోసం
సూర్యాపేట జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని పిల్లలమర్రి కి ఈ రోజు భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం భక్తజనం బారులు తీరారు. తెల్లవారుజాము నుండే దేవాలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. స్వామి వారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని కీర్తిస్తూ శివ, అయ్యప్ప దీక్షా స్వాములు భజనలు చేశారు. ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది.
పిల్లలమర్రిలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సూర్యాపేట, ఆంధ్రప్రభ : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాలను కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి సతీమణి జ్యోతి ధర్మారెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. త్రికుటాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి నామేశ్వర, ఎరకేశ్వర స్వామి దేవాలయాలలో పూజలు చేశారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలు వెలిగించి అర్చకులకు దీపదానం చేశారు. ఆమె వెంట మాలతి, రేణుక ఉన్నారు.


