ఏర్పాట్లను పూర్తి చేసిన నిర్వాహకులు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా(Adilabad District ఉట్నూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మైదానంలో సోమ, మంగళ రెండు రోజులు కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు కార్తీక దీపోత్సవ సమితి ఏర్పాట్లు సిద్ధం చేశారు.
కార్తీకదీపం కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ దీపోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కార్తిక దీపోత్సవ సమితి నిర్వాహకులు శ్రీరామ్ నాయక్(Sriram Naik), డాక్టర్ సాడిగే రాజగోపాల్ కోరారు.

