వేడుమ రాముకు ఘ‌న నివాళులు

వేడుమ రాముకు ఘ‌న నివాళులు

తిర్యాణి, ఆంధ్ర‌ప్ర‌భ : ఆదివాసుల సంస్కృత, సంప్రదాయాలు భావితరాలకు అందించాల‌ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కో లక్ష్మి(Ko Lakshmi) అన్నారు. ఈ రోజు ఎదులపాహడ్ గ్రామంలో వేడుమ రాము 38వ వర్ధంతి సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా రాముకు ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీల సాంస్కతి, సంప్ర‌దాయాలు చాలా గొప్పవని అన్నారు.

వెడమ రాము, కుంరం సూరు, కొమురం భీమ్(Komuram Bheem) లాంటి మహానుభావుల వల్లే మనం అనేక రంగాల్లో ముందుకు సాగడం జరుగుతుందన్నారు. నాడు జల్ జంగల్ జమీన్ పోరాటంలో వేడుమ రాము తన కళారూపాలతో గిరిజ‌నుల‌ను చైతన్యవంతులు చేశార‌న్నారు. వేడుమ‌ రాము కుటుంబంలో సైతం ఒకరిద్దరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతోపాటు తన వారసులు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దీనికి తమవంతుగా ప్రత్యేక కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఏదులపహాడ్(Edulapahad) గ్రామాన్నిటూరిజంలోభాగంగాఅన్నిరకాలసౌకర్యాలను కల్పించాలని కోరారు. అంతకుముందు గోయగం గ్రామంలో సీఎస్ఆర్, డీఎంఎఫ్‌టీ నిధులు రూ.5 లక్షలతో పెరిక సంఘం కమ్యూనిటీ హాల్ కు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డీడీ రమాదేవి, జిసిడిఓ, శకుంతల, ఏటీడీఓ చిరంజీవి(ATDO Chiranjeevi), గిరిజన క్రీడల జిల్లా అధికారి మడవి శేకు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హనుమాడ్ల జగదీష్, పీఏసీఎస్‌ చైర్మన్ సుంచు శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యం రాజయ్య, బుర్ర మధుకర్, తోటి బిరుదు గుండు సేవా సంఘం నాయకులు సంతోష్(Santhosh), దస్రు, తిరుపతి, ఆయా ఆదివాసీ సంఘాల నాయకులు, ఆయా ఆశ్రమపాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply