రూ.1.30 లక్షల నగదు స్వాధీనం
ఆరుగురు జూదరుల అరెస్ట్
నంద్యాల బ్యూరో అక్టోబర్ 26 ఆంధ్రప్రభ : పట్టణంలో ఒకచోట రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేసి పలువురు పట్టుకున్నారు. వన్ టౌన్ ఐ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పట్టణము టూ టౌన్ పరిధిలో రహస్యంగా పేకాట ఆడుతున్న వారి సమాచారం రావడంతో ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతుండడం టూ టౌన్ పరిధిలో ఉండటంతో వారిని ఆ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. వారి వద్ద నుంచి రూ.1.30 లక్షల నగదు, నాలుగు సెల్ ఫోన్లు,పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆరుగురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూన్న పోలీసులు తెలిపారు.

