పోలీసు ఓపెన్ హౌస్‌లో తిరుపతి చిన్నారులు ఆశ్చర్యం

పోలీసు ఓపెన్ హౌస్‌లో తిరుపతి చిన్నారులు ఆశ్చర్యం

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రపభ : దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం ఎప్పటికీ చిరస్మరణీయమే, అని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు(SP Subbarayadu) అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీస్ ఆయుధాల అవగాహన ప్రదర్శనను ఎస్పీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో ఉపయోగించే వివిధ రకాల ఆయుధాలు, భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఫోరెన్సిక్ సామగ్రి వంటివి ఎలా పనిచేస్తాయో, అవి ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తామో విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నాం. యువతలో పోలీస్ వ్యవస్థ(Police System)పై అవగాహన, విశ్వాసం పెంచటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం” అన్నారు. “పోలీసు వ్యవస్థ ప్రజల భద్రత కోసం 24 గంటలూ కృషి చేస్తుంది. ప్రతి పౌరుడు కూడా చట్టానికి సహకరించాలనే బాధ్యతతో ముందుకు రావాలి.

సమాజంలో శాంతి భద్రతల కోసం పోలీసులు, ప్రజలు కలిసి పనిచేయాలి” అని ఎస్పీ తెలిపారు. ఏడు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో(Colleges) ఈ కార్యక్రమాన్నినిర్వహించారు. విద్యార్థులకు భద్రతా అవగాహన,ట్రాఫిక్ నియమాలు, మహిళా రక్షణ, సైబర్ సేఫ్టీ వంటి అంశాలపై ప్రత్యేక ప్రదర్శనలు, సదస్సులు, చర్చా కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

ఈ ప్రదర్శనలో వివిధ విభాగాల పోలీసుల ఆధ్వర్యంలో – ఎస్ఎల్‌ఆర్(SLR), ఇన్‌సాస్, 9 ఎమ్‌ఎం పిస్టల్ వంటి ఆయుధాలు, డ్రోన్ పరికరాలు, బులెట్ ప్రూఫ్ జాకెట్లు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, – ఫోరెన్సిక్ సామగ్రి , స్నిఫర్ డాగ్ యూనిట్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. – ఈ ప్రదర్శనలను విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. పోలీస్ అధికారులను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణా నైపుణ్యాన్ని చూసి విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకటరావు(Sri Venkata Rao) (పరిపాలన), శ్రీ రవి మనోహర్ ఆచారి (శాంతి భద్రతలు), శ్రీనివాస్ రావు (సాయుధ దళం); డీఎస్పీలు స్పెషల్ బ్రాంచ్ వెంకట్ నారాయణ, భక్తవత్సలం (తిరుపతి), చంద్రశేఖర్ (సాయుధ దళం) పాల్గొన్నారు.

Leave a Reply