మ‌హిళ‌లు అన్ని రంగాల్లో ముందుండాలి

మ‌హిళ‌లు అన్ని రంగాల్లో ముందుండాలి

ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. ఆంజనేయులు

శావల్యాపురం, అక్టోబర్ 26 (ఆంధ్రప్రభ) : మహిళల సమస్యలు వెంటనే తీర్చాలని ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జెండార్ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. ఆంజనేయులు తెలిపారు. శావల్యాపురం గ్రామంలో మండల సమాక్య కార్యాలయంతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన జెండార్ రిసోర్స్ సెంటర్ను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శనివారం రాత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీ రాణి, జిల్లా సమాఖ్య‌ అధ్యక్షురాలు కోయా రజని, మండల సమాక్య అధ్యక్షురాలు గోనుగుంట్ల భారతి పాల్గొన్నారు.

Leave a Reply