పేదల ఇళ్లపై చేయి వేస్తే.. నా ఇంటిపై వేసినట్టే
పాపంపేట భూ వివాదం పై పరిటాల శ్రీరామ్
అనంతపురం సిటీ అక్టోబర్ 24 (ఆంధ్రప్రభ) : పాపంపేట ప్రజలకు అండగా నేనున్నా.. వారి ఇళ్లపై చేయి వేస్తే నా ఇంటిపై వేసినట్టే అని పరిటాల శ్రీరామ్ అన్నారు. పాపంపేట భూ వివాదం పై పరిటాల శ్రీరామ్ స్పందించారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరో ఒకరు నా వెంట తిరిగినంత మాత్రాన ముఖ్యం కాదని… పాపంపేటలో నా వెంట వందమంది తిరిగి ఉంటారన్నారు… ఒక్కరి కోసం వంద మందిని వదులుకోనని స్పష్టం చేశారు. ఇంతవరకు పాపంపేట భూ సమస్యను నా దృష్టికి ఏ ఒక్కరూ తీసుకురాలేదన్నారు.. రాజకీయ నిరుద్యోగులు అయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తోపాటు మరికొంతమంది వారి ఉనికిని కాపాడుకునే కి ఇక్కడ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకొని ప్రజలకు వివరించేందుకే ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పారు. త్వరలో పాపంపేటకు మంచినీరు ఇస్తున్నామని తెలిపారు. మంచినీరు ఇస్తే తమ కుటుంబానికి మంచి పేరు వస్తుందని ఇలాంటి వివాదాలు సృష్టించి బట్ట కాల్చి మొహం మీద వేసినట్టు ప్రకాష్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇళ్లకు తాము పట్టాలు ఇప్పించి పరిష్కారం మార్గాలు చూపామని.. నేనున్నానంటూ ప్రజలను మోసం చేసిన ప్రకాష్ రెడ్డి ఆ తర్వాత ఇల్లు కూలగొట్టే వరకు వచ్చిందన్న విషయాన్ని శ్రీరామ్ గుర్తుచేశారు.. వైసీపీ పార్టీలో ప్రకాశ్ రెడ్డికి రాప్తాడు ఇన్చార్జి పదవి ఉంటుందో ఉండదో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. ఈ భూ వివాదంలో నారాలోకేష్‌కు భాగాలు ఉన్నాయని ప్రకాశ్ రెడ్డి అంటున్నారని గతంలో జగన్ కు నువ్వు ఎంత పంపించినావు చెప్పాలన్నారు.. నేను జిల్లాలో ఉంటూ సమాధానం చెబుతాను కాబట్టి ఎక్కడో హైదరాబాదులో ఉంటున్న నా తమ్ముడు సిద్ధార్థ పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపంపేట ప్రజలు ఎవరైనా బుధవారం రోజున మా ఇంటికి వచ్చినా లేదా నన్ను పాపం పేటకు రమ్మన్న వచ్చి వివాదాలకు శాశ్వత పరిష్కారాలు ఆలోచిద్దామని పరిటాల శ్రీరామ్ చెప్పారు.

