అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకోవాలి
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
అచ్చంపేట అక్టోబర్ 25, (ఆంధ్రప్రభ) : ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా నవంబర్ 6న అచ్చంపేట పట్టణంలోని ఏరియా హాస్పిటల్‌లో పెద్ద ఎత్తున నిర్వహించబోయే ఉచిత మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్‌ను నియోజకవర్గం తోపాటు ఇతర జిల్లాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో కోరారు.
సీబీఎం ట్రస్ట్ చైర్ప ర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ సహకారం, మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ మెడికల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఇట్టి మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంపులో ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి వైద్య సేవలందించడమే కాకుండా మందులు కూడా ఉచితంగా అందజేస్తారని, తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు మహేష్, ప్రదీప్, పావని, బిక్కు, సూపరింటెండెంట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

