20 కి.మీ సైకిల్ ర్యాలీ

కరీంనగర్, ఆంధ్ర‌ప్ర‌భ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు కరీంనగర్(Karimnagar) పోలీస్ కమిషనర్ గౌస్ అలం ఆధ్వర్యంలో నగరంలో 20 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ(20 km cycle rally)ని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని కరీంనగర్ పోలీస్ కమీషనర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సైకిల్ ర్యాలీలో కరీంనగర్ రన్నర్స్, సైక్లిస్ట్ అసోసియేషన్ సభ్యులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, డాక్టర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్ స్టేషన్, ప్రతిమ మల్టీప్లెక్స్, గీతాభవన్ చౌరస్తా, మంకమ్మతోటలోని పొన్నం కాంప్లెక్స్, శివ థియేటర్ సర్కిల్, కెమిస్ట్ భవన్(Chemist Bhavan) మీదుగా సాగింది. అనంతరం ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్ద యూ టర్న్ తీసుకుని, కోర్ట్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, నాఖా చౌరస్తా, బోట్ చౌరస్తా, కమాన్ చౌరస్తా, తిరిగి బస్టాండ్ సర్కిల్, ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా ప్రయాణించి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ముగిసిందని సీపీ తెలిపారు.

కార్యక్రమ అనంతరం సీపీ ర్యాలీలో పాల్గొన్న సభ్యులకు అమరవీరుల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ర్యాలీలో పాల్గొన్న సభ్యులందరికీ సీపీ చేతుల మీదుగా మెడల్స్ అందించారు.

పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో అక్టోబర్ 31వ తేదీ(31st October) వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ శ్రీ గౌష్ ఆలం తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(Additional DCP)లు వెంకటరమణ, భీంరావు, ఏసిపిలు వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి, మాధవి, కమిషనరేట్ చెందిన ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. వీరితో పాటు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, కరీంనగర్ కమిషనరేట్ రన్నర్స్ మరియు సైక్లిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ పాసుల, డాక్టర్ అజయ్ ఖండాల(Dr. Ajay Khandala), డాక్టర్ కిరణ్ లతో పాటు పాఠశాల విద్యార్థులు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply