డీసీసీల ఎంపికలో..
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఢిల్లీ, ఆంధ్రప్రభ : డీసీసీల ఎంపికలో సామాజిక న్యాయం ఉంటుందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న సమావేశానికి ఢిల్లీకి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ జరిగే భేటీలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొంటారని చెప్పారు.
డీసీసీల నియామకాల్లో (DCC appointments) తమరి అభిప్రాయాలను సైతం తీసుకుంటారని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాల అధ్యక్షులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సమర్థవంతమైన వారికి డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తామన్నారు. కనీసం పార్టీలో ఐదేళ్లు పనిచేసిన వారికి డీసీసీ పదవికి అర్హులని నిబంధన పెట్టారన్నారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఇతర పదవుల్లో ఉన్నవారికి డీసీసీ పదవి ఇవ్వకూడదనే నిబంధన ఉందని వివరించారు.

