మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
తోగుట, ఆంధ్రప్రభ : సిద్ధిపేట జిల్లా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజున తొగుటలోని మార్కెట్ యార్డ్ లో కాన్గల్ సొసైటి ఆధ్వర్యంలో ప్రారంభించిన కొనుగోలు కేంద్రానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నలకు మద్దతు ధర రూ.2400 అందిస్తుందని, రైతులు దళాలను నమ్మి మోసపోదని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా చూడాలని, అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏఓ మోహన్ కాన్గల్ సొసైటీ సీఈవో గంగారెడ్డివైస్ చైర్మన్ కర్మ యాదగిరి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి, మాజీ సర్పంచ్ పాగాల కొండల రెడ్డి, తోగుట ప్రెస్ క్లబ్ అధ్యక్షుల ఊళ్లేంగా సాయిముదిరాజ్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు చిక్కుడు బాలమల్లు,సంతోష్ నాయకులు కొంగరి నర్సింలు,మైపాల్ రెడ్డి, బూసనిరంజన్ రెడ్డి, ఎన్నం భూపాల్ రెడ్డి, మల్లారెడ్డి, బుర్ర నర్సింలు,బాలరాజు, భరత్, బర్రింకల స్వామి, చిక్కుడు స్వామి, బీరయ్య,తదితరులు పాల్గొన్నారు.

