బస్సు ప్రమాదంపై అధికారుల‌ సంతాపం

బస్సు ప్రమాదంపై అధికారుల‌ సంతాపం

శ్రీ సత్య సాయి బ్యూరో, అక్టోబర్ 24 (ఆంధ్రప్రభ ):కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, డీటీసీ,ఆర్టీఓ కరుణ సాయి రెడ్డి, నేషనల్ హైవేస్ అధికారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు పలువురు డీఎస్పీలు సంతాపం తెలిపారు. ప్ర‌మాదం నేపథ్యంలో పుట్టపర్తి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నందు శుక్రవారం జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమన్వయ సమావేశం అత్యవసరంగా నిర్వహించారు. ముందుగా కర్నూలు బస్సు ప్రమాదం పట్ల వారు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

దుర్ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా కలెర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి బస్సు వివరాలను, వాటి అనుమతులు, కండిషన్ తదితర అంశాల గురించి పూర్తి డేటా సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా సమాచారాన్ని సేకరించి, ఇందుకు ఏమాత్రం విరుద్ధంగా ఉన్న సంబంధిత బస్సులను సీజ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధానంగా ప్రవేట్ బస్సులపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన చోట్ల పోలీస్ సిబ్బందిని సైతం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Leave a Reply