విద్యార్థులకు గాయాలు…

విద్యార్థులకు గాయాలు…

మహబూబ్ నగర్,క్రైమ్, అక్టోబర్ (ఆంధ్రప్రభ): టపాసులు పేలి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. మహబూబ్ నగర్ మండలం రేగడిగడ్డ తాండ పంచాయతీ పరిధిలోని ప్రైమరీ పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఉదయం క్లాస్ బయట టపాసులు పేల్చారు. అవి పేలడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ సమయంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి దీపావళి టపాసులు కాల్చుదాం అంటూ క్లాసులో ఉన్న విద్యార్థులను బయటకు తీసుకెళ్లాడు.

టపాసులలో వంకాయ బాంబు వారికి చూయించి దానిలో ఉన్న పౌడర్ను మరో వంకాయ బాంబుపై పూసి పేల్ చేశారు.దీంతో పక్కనే ఉన్న విద్యార్థులు రుషిక, వసంత, మానస విద్యార్థులకు చేతులు,ముఖంపై కాలిపోయాయి. ప్రస్తుతం ఆ విద్యార్థులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply