రెండు లారీలు ఢీ..
వ్యక్తి అక్కడికక్కడే మృతి
మరొకరికి తీవ్ర గాయాలు
ఏలూరు ఆంధ్ర ప్రభ బ్యూరో: ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణ పురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాగా, మరోవ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రుని ఘటనా స్థలం నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.

