సీజీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

సీజీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలోని చెన్నారాయుని స్వామి గుడి సీజీ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దీంతో ఇరిగేషన్ అధికారుల నిర్ణయం మేరకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇటీవలనే కర్ణాటక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సిజి ప్రాజెక్టుకు వరద నీరు బాగా వచ్చింది. తాజాగా శ్రీ సత్య సాయి జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సిజి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది.

ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు విషయాన్ని స్థానిక శాసన సభ్యులు కందికుంట వెంకటప్రసాద్ కు తెలిపి గురువారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ ప్రాజెక్టులో జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి తెలుగుదేశం తనకల్లు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply