25 నుంచి జ‌నంబాట

యాదాద్రి జిల్లా ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : పార్టీ పెడితే త‌న‌కు కాద‌ని, ప్రజలకు మేలు జరగాల‌ని, ప్ర‌జలు కోరుకుంటే పార్టీ ఏర్పాటు చేస్తాన‌ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితKalvakuntla’s poem) అన్నారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నారసింహా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ నెల 25 నుంచి త‌న సొంత ఊరు నిజామాబాద్(Nizamabad) నుంచి ‘జనం బాట’ కార్యక్రమం ప్రారంభిస్తామ‌ని క‌విత తెలిపారు. రాష్ట్రంలో నాలుగు నెలలు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఉండి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని అన్నారు. మేధావులు, విద్యావంతులు, రైతులు, యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలను కలుస్తామన్నారు.

తెలంగాణ వచ్చాక కేసీఆర్ యాదాద్రిని చక్కగా పునర్నిర్మించారని, యాదాద్రి ప్రాశ్యస్తాన్ని కాపాడే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేయాలని అన్నారు. మళ్లీ యాదాద్రి(Yadadri)కి వస్తామ‌ని, అప్పుడు ఇక్కడున్న అన్ని సమస్యలపై వివరంగా మాట్లాడతానని చెప్పారు. తెలంగాణ జాగృతి పుట్టి 19 ఏళ్లుగా కొనసాగుతోందని చెప్పారు. ప్రజా సమస్యలతో పాటు రాజకీయ అంశాలను కూడా గతంలో మేము మాట్లాడామని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాజకీయాలు, రాజకీయ సమీకరణాలు మాట్లాడటం జరిగిందని గుర్తు చేశారు.

సివిల్ సోసైటీ(Civil Society) సంస్థ అయినప్పటికీ అవసరమైతే రాజకీయాలు పుష్కలంగా మాట్లాడతామ‌న్నారు. రాజకీయాలు మాట్లాడాలంటే రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తాం. అందులో ఇబ్బందేమీ లేదన్నారు.

ప్రాంతీయ పార్టీలు ప్రజలకు మేలు చేయాలని కవిత గుర్తు చేశారు. ఏపీలో మూడు, తమిళనాడు లో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కేరళలో గల్లీకి ఒక పార్టీ ఉందన్నారు. పార్టీలు ఉండటం పెద్ద విషయం కాదని, వాటి వల్ల ప్రజల(People)కు మేలు జరగాలన్నారు. తాను పార్టీ పెడితే త‌న‌కు లాభం కాద‌న్నారు. ప్రజలకు మేలు జరిగేందుకు ప్రయత్నిస్తానని, ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ‘జనం బాట’ ద్వారా వారిని కలిసేందుకు వెళ్తున్నామని చెప్పారు.

Leave a Reply