పూర్తి వివరాలు ఎప్పుడో..?
దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి సినిమాతో సంచలనం సృష్టించారు. ఇంకా చెప్పాలంటే.. ఈ మూవీతో తెలుగు సినిమా సత్తా ఏంటి అనేది ప్రపంచానికి మరోసారి తెలిసింది. బాహుబలి సినిమాతో బాలీవుడ్.. టాలీవుడ్ వైపు చూస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ టాలీవుడ్ వైపు చూసింది. ఇప్పుడు రాజమౌళి హాలీవుడ్ ని మైమరపించేలా.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో క్రేజీ పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం జక్కన్న అదిరిపోయే ప్లాన్ రెడీ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ.. జక్కన్న ప్లానింగ్ ఏంటి..? ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు..?
ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్ బరిలో నిలబెట్టడం కోసం రాజమౌళి చాలా కష్టపడ్డారు. భారతదేశం తరుపున అఫిషియల్ గా ఆస్కార్ బరిలో నిలవకపోయినా.. వేరే రూటులో ఆస్కార్ బరిలో నిలిచేలా చేశారు. ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యింది. ఎవరూ ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ తీసుకువచ్చి చరిత్ర సృష్టించారు. అయితే.. మహేష్ బాబుతో చేస్తోన్న మూవీని ఆస్కార్ బరిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నిలిచేలా చేయాలి అనుకుంటున్నారట. అందుకనే హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి దుర్గా ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
ఇక టైటిల్ విషయానికి వస్తే.. గతంలో గోల్డ్ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. లేటెస్ట్ గా వారణాసి అనే టైటిల్ ఖరారు చేశారని ప్రచారం మొదలైంది. ఇప్పటి వరకు ఏ సినిమా చేసినా ముందుగా ప్రెస్ మీట్ పెట్టి కథ గురించి తెలియచేసి షూటింగ్ స్టార్ట్ చేసేవారు జక్కన్న. అయితే.. ఇప్పుడు రూటు మార్చి ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండా సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు. మహేష్ పుట్టినరోజైన ఆగష్టు 9న ఈ క్రేజీ మూవీ ప్రీ లుక్ రిలీజ్ చేసి.. నవంబర్ లో పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు. ఇక అక్కడ నుంచి నవంబర్ లో ఏ తేదీన ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ ప్రెస్ మీట్ పెడతారా..? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు అఫిషియల్ గా ఎప్పుడు..? ఎక్కడ..? అనేది ప్రకటించలేదు. అయితే.. నవంబర్ 11 లేదా 15న హైదరాబాద్ లో భారీ మీడియా మీట్ ద్వారా రాజమౌళి పూర్తి వివరాలు అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా నవంబర్ 11 లేదా 15న ప్రకటిస్తారో.. లేక మరో డేట్ లో అనౌన్స్ చేస్తారో తెలియాల్సివుంది.