తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి..
తిరుమల, ఆంధ్రప్రభ : ఆపదమొక్కులవాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మాజీ పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ (BalkaSuman) దర్శించుకున్నారు. గురువారం వేకువ జామున శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
అనంతరం ఆశీర్వాద మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ… తెలంగాణ (Telangana) ప్రజలు సుభిక్షంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నామన్నారు. తెలంగాణ రైతాంగం అధిక దిగుబడి సాధించాలని కోరుకున్నామన్నారు.