నామినేషన్ల స్క్రూటినీ పూర్తి
హైదరాబాద్, ఆంధ్రప్రభ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (JubileeHills ByElection) నామినేషన్ల స్క్రూటినీ నిన్న పొద్దుపోయిన వరకు జరిగింది. సక్రమంగా లేవని 186 నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. మొత్తం నామినేషన్లు (Nominations) 321, పరిశీలన అనంతరం ఆమోదించినవి 135. మిగిలిన 186 తిరస్కరించారు. నామినేషన్ వేసిన వారు 211 మంది. ఇందులో 81మంది దాఖలు చేసిన నామినేషన్లు సక్రంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మిగిలిన 130 మంది నామినేషన్లు సక్రమంగా లేవని తిరస్కరించారు.