రైలు నుంచి జారిపడి వలస కూలీ దుర్మరణం

  • మంత్రాలయంలో విషాదం

ఆంధ్రప్రభ, మంత్రాలయం ( కర్నూలు జిల్లా) : కుటుంబ పోషణార్థం వలస పోయాడు. తిరిగి ఇంటికి వచ్చి పిల్లపాపలతో ఎలా గడపాలో ఊహల్లో తేలుతున్న ఓ నిరుపేదను మృత్యువు కాటేసింది. రైలు ప్రమాదంలో మింగేసింది. అతడు లేడనే సమాచారంతో భార్య పిల్లలు అల్లాడపోతున్నారు.

ఈ హృదయ విదారక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు విరుద్ధగర్ జిల్లా ముత్తు సమియ పురం మండలం ముహవుర్ గ్రామానికి చెందిన బాల్ రాజ్ ( 33) కు భార్య కామాక్షి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబం ఆకలి తీర్చేందుకు గుజరాత్ లోని సోలాపూర్ ప్రాంతంలో కూలీనాలీ పనులు చేస్తున్నాడు.

తిరిగి తమ ఇంటికి బయలు దేరాడు. మధురై వరకూ టిక్కెట్టు తీసుకుని నాగర్ కొయిల్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. మంగళవారం మద్యాహ్నం మంత్రాలయం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో రెండు మోకాళ్లు తెగి పడ్డాయి. తీవ్ర రక్త గాయాలతో పడిన క్షతగాత్రుడు బాలరాజ్ ను 108 అంబులెన్స్ లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఇక్కడ వైద్య సేవలు అందిస్తుండగా మద్యాహన్నం ప్రాణాలు వదిలాడు.

Leave a Reply