తిరుపతిలో వైట్ టైగర్ కన్నుమూత

  • అనారోగ్యంతో ఏడాదిగా.. అచేతన స్థితి..

తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర నేషనల్ జూ పార్కు నందు 19 ఏళ్ల సమీర్ అనే వైట్ టైగర్ అవసాన దశలో అనారోగ్యంతో మృతి చెందింది. ఈ మేరకు జూ క్యూరేటర్ సెల్వం ప్రకటించారు. మృతి చెందిన పెద్ద పులిని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పెథాలజీ విభాగం వైద్యుల బృందం నిర్వహించిన పంచ నామా లో పెద్దపులి మూత్రపిండాల్లో నీటి నిల్వ , వృద్ధాప్యంతో మరణించినట్టు నిర్ధారించింది.

ఐదేళ్ల ప్రాయంలోని సమీర్ ను 2011లో హైదరాబాదు నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి తిరుపతి జూకు తరలించారు. 14 ఏళ్ల పాటు జూపార్క్ లో ఈ పెద్దపులిని సంరక్షించారు. గత ఏడాది నుంచి ఆరోగ్య సమస్యలతో తిరగడానికి కూడా కష్టమైంది. ప్రత్యేక ఎన్ క్లోజప్ లో సమీర్ కు వైద్య చికిత్స అందించారు.

గత మూడు నెలలుగా సమీర్ ఆరోగ్య స్థితి మరింత క్షణించింది. ఆహారం తీసుకోవడం మానేసింది. ద్రవాహారంపైనే ఆధారపడింది. గత వారం రోజులుగా ఆహారం పూర్తిగా మానేసి కదల లేని స్థితికి చేరుకుంది. వెటర్నరీ వైద్యులు చికిత్స నిమిత్తం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోగా ఆదివారం ఉదయం సమీర్ మరణించినట్లు జూ అధికారులు తెలిపారు

Leave a Reply