క్షతగాత్రుని చికిత్సకు ఆర్థిక సాయం

తొర్రూరు, ఆంధ్ర‌ప్ర‌భ : రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి కోమాలోకి వెళ్లిన యువ‌కుడి చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందించి స్థానిక కాంగ్రెస్ నాయకురాలు మాలోతు సునీత రాజేందర్ మానవత్వం చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామానికి చెందిన తుమ్మనపెల్లి సుధాకర్-ధనలక్ష్మి దంపతుల కుమారుడు తుమ్మనపెళ్లి ప్రజీత్ ఈ నెల 4న రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాల కావడంతో స్పృహ కోల్పోయాడు.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తండ్రి చిన్నప్పుడే మృతి చెందారు. ఆర్థిక స్తోమత లేక పోవడంతో చికిత్స ఎలా చేయించాలో పాలుపోక తల్లి ధనలక్ష్మి ఆర్థిక సహాయం చేసి త‌న‌ కుమారుని ప్రాణాలు కాపాడాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్య‌క్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిలను అభ్య‌ర్థించారు. వారి సూచ‌న‌ మేరకు వెలికట్ట గ్రామానికి చెందిన కాంగ్రెస్ మహిళ నాయకురాలు మాలోత్ సునీత-రాజేందర్ చికిత్స కోసం రూ. 50 వేల రూపాయల నగదును ఈ రో్జు అంద‌జేశారు.

మ‌రికొంద‌రు ఆర్థిక సాయం చేయ‌డానికి ముందుకు రావాల‌ని సునీత కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశగాని భిక్షపతి, భోగ కమలాకర్, బందు వెంకన్న, సోమారపు ఐలయ్య, కనుకుంట్ల కుమార్, వడ్లకొండ కుమార్, కొమ్ము యాకయ్య, భోగ రవి, వెంకట సోములు, ఎసబోయిన ఐలయ్య, జాటోత్ కిషన్, వీరమ్మనేని రమేష్, జాటోత్ రాం లాల్, మాలోత్ యాకు నాయక్, బందు సంజీవ, దీకొండ ఐలయ్య, బొచ్చు వెంకన్న, బందు రవి, దిశగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply