వీరిలో ఆశన్న సహా.. పలువురు కీలక నేతలు

వీరిలో ఆశన్న సహా.. పలువురు కీలక నేతలు

ఇందులో 110 మంది మహిళలు
153 ఆయుధాలు అప్పగింత


( చర్ల / చింతూరు, ఆంధ్రప్రభ) : బస్తర్‌ రేంజ్‌ ఐజీ ముందు శుక్రవారం 208 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. దేశంలోనే అతిపెద్ద మావోయిస్టుల లొంగుబాటు- కార్యక్రమంగా ఈ లొంగుబాటు చరిత్ర సృష్టిస్తోంది. బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌ రాజ్‌, సీనియర్‌ సీఆర్పీఎఫ్‌ అధికారుల ముందు లొంగిపోయిన 208 మంది మావోయిస్టుల్లో 110 మంది మహిళలు ఉన్నారు. 153 ఆయుధాలను పోలీసు అధికారులకు అప్పగించారు.

19 ఏకే 47 రైఫిల్స్, 17 ఎస్ఆర్ ఎల్ రైఫిల్స్, 23 ఇన్సాస్ లు, ఒక ఎల్ఎంజీ (ఇన్సాస్), 303 రైఫిల్స్ 36, బీజీఎల్ 11, బోర్ షాట్ గన్లు, పిస్టల్స్ 41, నాలుగు కార్సైన్స్ ను పోలీసులకు అప్పగించారు. ఇటీవల సీఎం ఫడ్పవీస్ ఎదుట మల్లోజుల వేణుగోపాలరావు లొంగిన అనతి కాలంలో.. ఆయన అనుచర వర్గంగా భావిస్తున్న డకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ- ( డీకేఎస్‌జేడ్‌సీ) ప్రతినిధి రూపేష్‌ సహా 140 మంది గురువారమే బస్తర్ కు బయలు దేరారు.

ఇందులో 120 మంది భూపతి బృందం సభ్యులే. బీజాపూర్‌ జిల్లా(Bijapur district) లోని ఇంద్రావతి నదికి ఆవల ఉస్పారి ఘాట్‌ వద్ద సమావేశమమై అక్కడ నుండి బయలుదేరారు. మావోయిస్ట్‌ సంస్థ వ్యూహాలను రూపొందించడంలో రూపేష్‌ కీలకపాత్ర పోషించారు. లొంగిపోయే మావోయిస్టుల్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, ఒక డీకేఎస్‌జడ్‌ కమిటీ సభ్యుడు, ఇద్దరు సౌత్‌ జోనల్‌ కమిటీ సభ్యులు, 15 మంది డీవీసీఎం సభ్యులు, ఏసీఎం క్యాడర్‌ , జన మీలిషీయా సభ్యులు మొత్తం 121 మంది కలుపుకొని 140 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారని గురువారం లెక్కగట్టారు.

శుక్రవారం ఏకంగా 208 మంది తెరమీదకు రావటంతో.. ఇక మరి కొన్ని రోజుల్లో దండకారణ్యంలో మావోయిస్టుల జాడ ఉండదని, 2026 మార్చి ముందే కగార్ ఆపరేషన్ ముగుస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.ఇప్పటికే గత రెండు రోజుల్లో దండకారణ్యంలోని 358 మావోయిస్టులు లొంగిపోయారని, గురువారం 170 మంది లొంగిపోయారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ట్విట్టర్ వేదికలో ప్రకటించారు.

Leave a Reply