అడ్డుకున్న పోలీసులు..
ఉట్నూర్, ఆంధ్రప్రభ: గిరిజన సంక్షేమ శాఖ అశ్రమ వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీ వైస్ పార్ట్ టైం వర్కర్లు(Daily Vice Part-Time Workers) ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయం ముందు నిరవధిక 72 సమ్మెలో భాగంగా ఈ రోజు వర్షం కురిసిన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్యాలయం ముందర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పి మధు మాట్లాడుతూ.. ఉట్నూర్ ఐటిడిఏ పిఓ(ITDA PO) నిరంకుశత్వం నిరసిస్తూ జోరు వానలో సైతం ఐటీడీఏ ముట్టడిని కొనసాగిస్తున్న డైలీ వేస్ పార్ట్ టైం వర్కర్స్ పివో 220 మందిని తొలగిస్తూ సర్కులర్ విడుదల చేశారు.
దాన్ని వెనక్కి తీసుకోవాలని లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు. వర్కర్లు ఐటిడిఏ పీవో కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు గేటు వద్దనే అడ్డుకున్నారు. వర్గాలను తొలగిస్తూ విడుదల చేసిన జీవును పిఓ వెంటనే ఉపసంహరించుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఐటిడిఏ కార్యాలయలను ముట్టడి చేస్తామని అన్నారు. ఐటీడీఏ కార్యాలయం ముందు కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా రాత్రి సమ్మె టెంట్ లోని కార్మికులు బసచేయడంతో ఐటీడీఏ కార్యాలయం ముందు విద్యుత్ దీపాలను సరఫరా నిలిపివేయడం దారుణమని అన్నారు.
త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక ద్వారా కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసమ్ సచిన్(Poosam Sachin), సిపిఎం పార్టీ అదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిఐటియు ఆల్ ఇండియా కౌన్సిల్ మెంబర్ త్రివేణి, ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న(Bojja Ashanna), అన్నమొల్ల కిరణ్, కొమరం భీం జిల్లా సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు జాదవ్ రాజేందర్, ముంజం శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులుకృష్ణమాచారి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేందర్, తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ డైలీ వేజ్(Hostel Daily Wage) పార్ట్ టైం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టేకం ప్రభాకర్(Tekam Prabhakar), గిరిజన సంఘం ఉట్నూర్ మండల కార్యదర్శి మడవి నాగరావ్, తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్ డెలీ వేజ్ పార్ట్ టైం వర్కర్స్ యూనియన్ కొమరం భీం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తొడసం వసంతరావు ఆడ శ్యామ్ రావు, కోశాధికారి మరప రాంబాయి, జిల్లా నాయకులు శ్యామల,పుష్ప, తార,లక్ష్మి ఈరాబాయి, డైలీ వైజ్ పార్ట్ టైం వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.