రేపటి క‌ర్నూల్ ప‌ర్య‌ట‌నపై మోదీ ట్వీట్..

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు, (అక్టోబర్ 16 – గురువారం) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్ర‌ధాని మోదీ సుమారు రూ.13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ త‌న ప‌ర్య‌ట‌న‌పై ట్వీట్ చేశారు. ‘‘రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి’’ అని ట్వీట్ చేశారు.

Leave a Reply