ఇద్దరు చిన్నారులను చంపి… ఆపై…

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవ‌ల కాలంలో త‌ల్లిదండ్రుల మాన‌సిక స్థితిని చూస్తుంటే చాలా ఆందోళ‌నకరంగా మారిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.. వారి సమస్యలకు చిన్నారులను బలిచేస్తున్నారు…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ (Konaseema) జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ఆలమూరు (Alamuru) మండలం చిలకలపాడులో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తానే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

స్థానికుల సమాచారం మేరకు ఎస్సై నరేశ్‌ బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో పావులూరి కామరాజు (35), అతని కుమారులు అభిరామ్‌ (10), గౌతమ్‌ (7) మృతదేహాలను గుర్తించారు. కామరాజు గతంలో వాలంటీర్‌గా పనిచేశాడు. 2020లో భార్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply