కుట్టు మిష‌న్ అంద‌జేశారు…

కుట్టు మిష‌న్ అంద‌జేశారు…

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిరుపేద కుటుంబానికి చెందిన‌ మహిళ సంపంగి మాధురి(Sampangi Madhuri)కీ కమ్మర్ పల్లి లయన్స్ క్లబ్ ఈ రోజు కుట్టు మిషన్ అంద‌జేశారు. ఈ సందర్భంగా కమ్మర్ పల్లి మండల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లుక్క గంగాధర్(Lukka Gangadhar) మాట్లాడుతూ సంపంగి మాధురి భర్త బాలరాజ్(Balraj) మరణించడంతో తన ఇద్దరు పిల్లలను పోషిస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నార‌న్నారు.

లయన్స్ క్లబ్(Lions Club) నిర్వహించే ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ఇలాంటి నిరుపేద మహిళలకు చేయూత అందిస్తున్నామ‌న్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రేవతి గంగాధర్(Revathi Gangadhar), కోశాధికారి తెడ్డు రమేష్, ఉపాధ్యక్షుడు సున్నం మోహన్, కార్యవర్గ సభ్యులు నోముల నరేందర్, చింత ప్రదీప్, పాలేపు నర్సయ్య, చంద్ర శేఖర్,పవన్ సుంకరి విజయ్ కుమార్, సంపంగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply