డిప్యూటీ సీఎంకు వేద పండితుల ఆశీర్వచనం..

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కనకదుర్గమ్మ ప్రత్యేక ఆశీస్సులు లభించాయి. పవన్ కళ్యాణ్ ని ఆయన కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవదాయశాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీ డాక్టర్ హరి జవహర్ లాల్, దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ దేవస్థానం ఈవో శీనా నాయక్, అర్చకులు, వేద పండితులు కలిసి కనకదుర్గమ్మ ఆశీస్సులు అందజేశారు. శ్రీ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల విజయవంతం గురించి వివరించారు..ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వేద పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

Leave a Reply