- బీఎస్ఈ .. నిఫ్టీ డమాల్
- రెండు రోజులుగా ఇదే స్థితి
ఆంధ్రప్రభ, వెబ్ బిజినెస్ డెస్క్ : అమెరికా.. చైనా టారిఫ్ కుస్తీలో… భారత దలాల్ మార్కెట్టు గిలగిల్లాడుతోంది. ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ కు అంతర్జాతీయ ఆర్థిక సమాజం తల్లడిల్లిపోతోంది. గడచిన రెండు రోజుల్లో షేర్ మార్కెట్లల్లో మదుపర్లు ఈ రెండు దేశాల పిడిగుద్దులతో కూలపడిపోతున్నారు.
మరీ ముఖ్యంలో బీఎస్ఈ, నిఫ్టీల్లో .. ఈ రెండు రోజుల్లోనే రూ.4.14 లక్షల కోట్ల పెట్టుబడి ఆవిరిగా మారింది. చైనాపై అమెరికా వందశాతం సుంకం విధించగా.. మరోవైపు భారతీయ ఉత్పత్తులపై 50 శాతం సుంకంతో .. షేర్ మార్కెట్లల్లో మదుపర్లను కుంగదీస్తోంది.
ట్రంప్ పేచీలతో అమెరికా మార్కెట్లు కూడా నష్టపోతున్నాయి. ఈ ప్రభావంతో వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకుని.. నిరాశగా తెరదించాయి. ఫార్మా, మెటల్, పీఎస్‌యూ, బ్యాంకింగ్ రంగాలు నష్టాల్లో లావాదేవీలు జరిగాయి.
సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో ఈ రోజును ట్రేడ్ ముగించాయి సోమవారం ముగింపు (82, 029)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 80 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో దాదాపు 550 పాయింట్లు నష్టపోయి 81, 781 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది.
మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల నుంచి కోలుకుంది. చివరకు సెన్సెక్స్ 297 పాయింట్ల నష్టంతో 82, 029 వద్ద లావాదేవీలను ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగింది. చివరకు 81 పాయింట్ల నష్టంతో 25, 145 నిరాశగా ఈ రోజు ముగించింది.
సెన్సెక్స్‌లో ఎమ్‌సీఎక్స్ ఇండియా, సోనా బీఎల్‌డబ్ల్యూ, ఇండియన్ రెన్యుబుల్, 306 వన్ వామ్, మ్యాక్స్ హెల్త్‌కేర్ మొదలైన షేర్లు లాభాలతో ముగిశాయి. టాటా మోటార్స్, డిక్సన్ టెక్నాలజీస్, వోడాఫోన్ ఐడియా, యూనో మిండా, బంధన్ బ్యాంక్ షేర్లను నష్టాలు పలకరించాయి.
నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 437 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 128 పాయింట్లు దిగజారింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.80గా ఉంది. సోమవారం BSE సెన్సెక్స్ 174 పాయింట్లు (0.21%) తగ్గి 82,327 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 50 సుమారు 58 పాయింట్లు (0.23%) తగ్గి 25,227 వద్ద ముగిసింది.
నిఫ్టీలో Tata Motors, Infosys, Wipro, Nestle India, Hindustan Unilever (HUL) ప్రధానంగా నష్టపోయాయి. Bharti Airtel, Bajaj Auto, Adani Ports లాభాలు పొందాయి మంగళవారం BSE సెన్సెక్స్ 297 పాయింట్లు (0.36%) తగ్గి 82,030 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 50 82 పాయింట్లు (0.32%) తగ్గి 25,145 వద్ద ముగిసింది.
నిఫ్టీలో Bajaj Finance, Bharat Electronics, Tata Steel, TCS, NTPC, Dr Reddy’s Laboratories, Trent నష్టపోయాయి. Max Financial Services లాభాలు పొందాయి. (మార్కెట్ మొత్తం నష్టంలో ఉండటంతో గెయినర్స్ తక్కువగా ఉన్నాయి; బ్రాడర్ మార్కెట్‌లో Vodafone Idea, Anant Raj వంటివి నష్టాల్లో ఉన్నాయి అక్టోబర్ 13, 2025 (సోమవారం) మార్కెట్ నష్టాల కారణాలు:
వామ్మో .. నష్టం .. వాయ్యో నష్టం
ఈ రోజు ఇండియన్ షేర్ మార్కెట్‌లో గణనీయ తగ్గుదలకు ప్రధాన కారణాలు గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ విదేశీ పెట్టుబడిదారుల (FIIs) వెనకడుగు. చైనాపై అమెరికా కొత్త టారిఫ్‌లు (ఆటో కాంపోనెంట్స్ మీద) విధించడం వల్ల సప్లై చైన్ డిస్రప్షన్స్ ఏర్పడి, గ్లోబల్ ఆటో సెక్టర్‌లో అనిశ్చితి పెరిగింది.
ఇది ఇండియన్ మార్కెట్‌కు కూడా ప్రభావం చూపి, టాటా మోటార్స్ వంటి కంపెనీలు ప్రధానంగా నష్టపోయాయి. భారతీయ ఈక్విటీల నుండి $13-15 బిలియన్లు (సుమారు ₹1.1-1.2 లక్షల కోట్లు) FIIలు ఉపసంహరించుకోవడం వల్ల అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
రూపాయి విలువ పతనం (₹88/$ పైకి) మోడెస్ట్ కార్పొరేట్ ఆర్నింగ్స్ కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. మంగళవారం నష్టాలు కూడా ముందు రోజు ట్రిగ్గర్స్‌కు కొనసాగింపుగా ఉన్నాయి. ట్రంప్ టారిఫ్ వార్ ప్రభావం మరింత తీవ్రమై, అమెరికా ఇండియన్ గూడ్స్ మీద 50% టారిఫ్‌లు విధించడం వల్ల ఎక్స్‌పోర్టర్లలో అనిశ్చితి పెరిగింది.
FII అమ్మకాలు కొనసాగడంతో మార్కెట్ మొత్తం ₹4.14 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కోల్పోయింది. అలాగే, Q2 ఎర్నింగ్స్ బలహీనంగా ఉండటం (ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, FMCG సెక్టర్లలో) రూపాయి బలహీనత వల్ల ఇంపోర్ట్ కాస్ట్‌లు పెరగడం కారణంగా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ మరింత తగ్గింది. బాంకింగ్, ఆటో, మెటల్ సెక్టర్లు ప్రధానంగా ప్రభావితమయ్యాయి.