మూడేళ్ల చిన్నారి మృతి

మూడేళ్ల చిన్నారి మృతి

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి శ్రీకాంత్(Srikanth) మృతి చెందాడు. ఎస్సై కే.సందీప్(SI K. Sandeep) తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే రహత్ నగర్ గ్రామంలో విద్యార్థులను తీసుకెళ్ళేందుకు కృష్ణవేణి పాఠశాల బస్సు వచ్చింది.

ఈ క్రమంలో ఉదయం తన అన్న విశాల్‌(Vishal)ను బస్సులో ఎక్కించడానికి కుటుంబ సభ్యులతో వచ్చిన సమయంలో బస్సు ముందర బాలుడు ఉన్న విషయాన్ని గమనించ‌ని డ్రైవర్(driver) నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో కింద పడి బాలుడు అపస్మారక స్థితిలోనికి వెళ్ళాడు. చికిత్స కోసం స్థానికులు హుటాహుటిగా నిజామాబాద్ జిల్లా(Nizamabad District) కేంద్రానికి బాలుని తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కే.సందీప్ తెలిపారు.

Leave a Reply