ఆ అష్టకష్టాలు పడొద్దు

  • ఆలోచించండి
  • అమరావతికి ఉజ్వల భవిష్యత్తు ఉంది
  • ఎన్డీయే ప్రభుత్వం శాశ్వతం కావాలి
  • సీఆర్డీయే భవనం ప్రారంభ సభలో .. సీఎం చంద్రబాబు


(ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి) : ఒకసారి తప్పు చేశాం. ఎంతో నష్టపోయాం. కష్టాలు పడ్డాం. ఇక మళ్లీ అలాంటి తప్పు చేయకూడదు. దేవతల రాజధాని అమరావతి. ప్రజారాజధాని గా మారుతుంది. అటు పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 2047 నాటికి ప్రపంచంలోనే మేటి దేశంగా భారత దేశం వెలుగుతుంది. ఇంజన్ గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది. ఓటమి లేకుండా ఎన్డీయే శాశ్వతంగా ఉంటుంది. మీ త్యాగం మర్చిపోం, అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అన్నారు. ఏపీ రాజధానిలోని తొలి అధికారిక సీఆర్డీయే భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరావతి రైతులతో తన మనోగతిని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఐదేళ్లు మీరు అష్ట కష్టాలు పడ్డారు. ఆడపిల్లలు ఆవమానాలు ఎదుర్కొన్నారు. కానీ మీ ఉద్యమం ఆగలేదు. మీ ఉద్యమ ఫలితంగా ఇక్కడ కూర్చున్నాం. మీరు పడిన కష్టాలు మర్చిపోకూడదు. త్యాగాలు చూశాను.

ఆ త్యాగాలు మర్చిపోను, అని చంద్రబాబు అన్నారు. ఫేజ్ 1లో మీరు భూములు ఇచ్చారు. ఫేజ్ 2 లో హింసను ఎదుర్కొన్నారు. రాజధాని ప్రాంతం ఎడారి అన్నారు. వేశ్యాల రాజధాని అని కించపర్చారు. కానీ.. ఇది ఇప్పుడు బ్రహ్మాండమైన సిటీగా అవర్భవిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ ఇలా సిటీ ఉండదు. సారవంతమైన భూములు, పక్కనే కృష్ణానది ఉంది, 40 లక్షల ఎకరాలు సాగు నీరు ఇచ్చే ఇలాంటి నది లేదు. గోదావరి, కృష్ణా సహా… నదులను అనుసంధానం చేస్తున్నాం. పలితంగా ప్రపంచలోనే మేటీ సిటీ గా అమరావతి ఆవర్భిస్తోంది. బంగారం పండించే భూములు ఇవి. గ్రీనరీకి కొరత ఉండదు. బ్లూ, గ్రీన్.. సోలార్ పవర్ కూడా వచ్చింది. గ్రీన్ హైడ్రోజన్ (Green hydrogen) కు వెళ్తున్నాం. కాలుష్యం లేని నగరంగా మారుస్తాం. హైదరాబాద్, బెంగళూరు, బొంబాయిల్లో పైప్ లైన్ లను చూశాం, అక్కడ రోడ్లపైనే పైపులు దెబ్బతింటున్నాయి. పైపులు మరమత్తులు లేకుండా.. ఏసీని ఇంటికి తీసుకువచ్చే గ్రీన్ సిటీగా మారుస్తాం. ఇక్కడి రైతాంగం త్యాగం చేశారు. ల్యాండు పూలింగ్ చేశారు. మీరు భూములు ఇచ్చారు.

అభివృద్ధి పెరుగుతుంది. ల్యాండ్ .. రాజధాని నిర్మాణానికి పైసా ఖర్చులేకుండా సెల్ఫ్ మానిటైజేషన్ అమలు చేశాం. హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధిలోనూ ప్రభుత్వం పైసా ఖర్చు చేయలేదు. ఈ రోజున ఆ నగరంలో 70 శాతం వనరులు పెరిగాయి. అక్కడ భూమి అమ్మాం, ఇక్కడ ల్యాండ్ మీరు ఇచ్చారు.ఇప్పుడు రాయదుర్గం ఎకరం భూమి విలువ 170 కోట్లు. కేవలం లక్ష రూపాయలకు దొరికే భూమి రూ.170కోట్లకు చేరింది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 5000 ఎకరాలు సేకరించాం. ఆరోజు వ్యతిరేకత వచ్చింది. కానీ ఈ రోజు భూమి విలువ ఎన్ని పెరిగిందో.. ఆలోచించండి, అని రైతులకు సీఎం చంద్రబాబు వివరించారు.

ఈ సిటీ ఇక్కడ ఆగిపోతే చిన్న సిటీగా మారుతుంది. ఎయిర్ పోర్టు శంషాబాద్ (Shamshabad). గచ్చిబౌలిలో స్పోర్ట్ సిటీ. ఉప్పల్ లో స్టేడియం కట్టాం. 163 కిలో మీటర్ల వడ్డాణం నెక్లెస్ ఇచ్చాం. కోర్ ఏరియాకు డిమాండ్ పెరిగింది. సైబరాబాద్ కి గిరాకీ పెరిగింది. ఆబిడ్స్, బంజారా హిల్ప్, జూబ్లీ హిల్స్ .. ఇప్పుడు హైటెక్ సిటీ మార్మోగుతోంది. ఇదీ సీడ్ ఆఫ్ గవర్నెన్స్.. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు వచ్చింది. ఇక అమరావతి సింగపూర్ ప్లాన్ .. సీడ్ క్యాపిటల్. కోర్ క్యాపిటల్. ఏడు రోడ్లు ఇతర రాష్ర్టాలను కలుపుతాయి. తరువాత పరిస్థితిని ఆలోచించాలి. ఎస్ఆర్ఎం, విట్ కు వచ్చాయి. ఆరోజుల్లో హైదరాబాద్ లో భూమిని అమ్మొద్దని చెప్పాను. కానీ ఒక్కసారిగా భూమి విలువ పెరిగే సరి అమ్మేశారు.

అదే భూమి ఇప్పుడు ధర ఎంత పెరిగిందో.. గమనించండి. భూమిని దుర్వినియోగం చేయొద్దు. మంచి భవిష్యత్తు ఉంది, అని చంద్రబాబు అన్నారు. అమరావతి (Amaravati) కి టెక్నాలజీ సంస్థలు వస్తున్నాయి. బిట్స్ ఫిలానీ. క్యాంటమ్ వాలీ.. గూగ్లూల్ , ఏఐ వస్తున్నాయి. ప్రధాని కాంట్వామ్ మిషన్ తీసుకువచ్చారు. క్వాంటమ్ వ్యాలీ తెస్తున్నాం, భవిష్యత్తు మారుతోంది. ఒకసారి తప్పునకు ..ఎన్నో కష్టాలు పడ్డాం, అందుకే ఓటమి లేకుండా శాశ్వతంగా ఎన్డీయే ప్రభుత్వాన్ని కొనసాగిద్దాం, జనసేన , టీడీపీ, బీజేపీ కలిసి పోతున్నాం. అమరావతి రైతులు, పారిశ్రామిక వేత్తలు కావాలి. మీ ప్రాంతం మారింది. ఆలోచన మారాలి. ప్రజల భవిష్యత్తు తరాలు.. విశాఖపట్నం ఫాస్ట్ గా వెళ్తోంది. గ్లూగుల్ పెట్టుబడి వస్తోంది. ఇక ప్రజారాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి.. అలాంటి రాష్ర్టాన్ని నిర్మిస్తాం. సమస్యలు పరిష్కరిస్తాం. యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాం. సూపర్ జీఎస్టీకి పీఎం ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 16న ఏపీకి వస్తారు. శ్రీశైలం, కర్నూలు లో పర్యటిస్తారు. ఆయనను ఆహ్వానించటానికి ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నాను, ఇక మిమ్మల్ని మర్చిపోలేం. మీ త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటాం. తొలి భవనం మన యాత్రకు ప్రారంభమైంది, అని సీఎం చంద్రబాబు అన్నారు.

Leave a Reply