హత్య కేసులో నిందితుల అరెస్టు
రామగిరి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీ ఐకేపీ కార్యాలయం వద్ద జరిగిన కోట చిరంజీవి హత్య కేసులో నిందితులను పోలీసులు 24 గంటలు తిరగక ముందే అరెస్టు చేశారు. వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేకనే పథకం ప్రకారం చిరంజీవిని హత్య చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేశ్ (ACP Ramesh) వెల్లడించారు.
హత్యకు పాల్పడిన నిందితులు సంధ్యతో పాటు అనవేన మల్లయ్య, అనవేన నరేశ్, పొలవేన కుమార్, పిడుగు చందులను పట్టుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి మూడు బైకులు, హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.