అప్రమత్తంగా ఉండాలని సూచన..

చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు (Chittoor) పట్టణంలో గురువారం రాత్రి భారీగా వర్షం కురిసింది. ఈ వర్షానికి పట్టణంలోని మురుగు కాలువలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా చిత్తూరుకు సమీపంలోని నీవానది ప్రవాహం పెరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు నీవా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ (Commissioner) పి.నరసింహ ప్రసాద్ చెప్పారు. గత రాత్రి కురిసిన వర్షానికి నీవా నదిలో నీటిమట్టం పెరగడంతో నగరంలోని వీరభద్ర కాలనీ, తేనెబండ రోడ్డు, రాజు గుడి వీధి, లిల్లీ బ్రిడ్జి ప్రాంతాల్లో నీవా నది ప్రవాహ పరిస్థితిని కమిషనర్ పరిశీలించారు.

వీరభద్ర కాలనీ(Veerabhadra Colony) లో నీవా నీటి ప్రవాహం ఇళ్ళ ముందుకు రావడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారుల ముందస్తు సూచనలను పాటించాలన్నారు. కల్వర్టుల వద్ద నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నాలు చేయవద్దన్నారు. వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున అత్యవసర బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నీవా నది ప్రవహించే కల్వర్టర్ల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ కులశేఖర్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఎంహెచ్ఓ డా లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ లోకనాథ్, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply