అనాధ విద్యార్థులకు దుస్తుల పంపిణి.
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి(Rebbanapalle) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ రోజు 15 మంది అనాధ పేద విద్యార్థులకు బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్(Big Help for Education) సంస్థ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి మంత్రి రాజు చేతుల మీదుగా దుస్తుల పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిగ్ హెల్ప్ సంస్థ సహకారాన్నిసద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలనీ, బిగ్ హెల్ప్ సంస్థ ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిగ్ హెల్ప్ సంస్థ డైరెక్టర్ ఎండి శరీఫోద్దీన్(Sharifuddin, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.