కాంగ్రెస్ మోసాలు తెలుసుకోండి….

పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 9(ఆంధ్రప్రభ): గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆరోపించారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీ ఆర్ ఎస్ నియోజక వార్డు ఇంచార్జీ దాసరి మనోహర్ రెడ్డి ఆద్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం గురువారం ఏర్పాటు చేసిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చిన హామీల అమలు బాకీపై ముద్రించిన కాంగ్రెస్ బాకీ కార్డులను దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఈశ్వర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావడ్తున్న ఇచ్చిన ఏ ఒక్క హామిని పక్కాగా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో నాయకులు గంట రాములు యాదవ్, రఘువీర్ సింగ్, మార్కు లక్ష్మణ్, ఉప్పు రాజ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply