29,000 మంది విద్యార్థులకు ప్రయోజనం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు, నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులకు వృత్తి శిక్షణను అందించే లాభాపేక్షలేని సంస్థ అయిన ‘ఉన్నతి ఫౌండేషన్(Unanti Foundation)’ కాకినాడలో కొత్త శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. కెప్టెన్ సుబ్బారావు(Captain Subbarao) ప్రభల ఉదార మద్దతుతో ప్రారంభించబడిన ఈ కేంద్రం, కీలకమైన ఉపాధి నైపుణ్యాలను, ఉద్యోగ అవకాశాలను పొందేందుకు యువతకు వీలు కల్పిస్తుంది.
2024లో కాకినాడలో తన శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది, దాదాపు 70 మందికి పైగా యువతకు విజయవంతంగా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధిని కల్పించడంలో సహాయపడింది. అంతేకాకుండా ఈ సంస్థ కళాశాలల్లో UNXT శిక్షణా కార్యక్రమాన్నికూడా నిర్వహిస్తోంది, కాకినాడలో దాదాపు 1,700 మంది విద్యార్థులకు చేరువవుతూ, కొత్తగా ఏర్పాటు చేయబడిన వృత్తి శిక్షణా కేంద్రం, UNXT మోడల్‌తో కలిపి ప్రతి సంవత్సరం కాకినాడలో 2,000 మందికి పైగా యువత(Youth)కు నైపుణ్యం, వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలను ఉన్నతి అందించనుంది. వృత్తి శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన ప్రతి వ్యక్తికి 35వ రోజు శిక్షణ నాటికి ఉద్యోగం లభిస్తుందనే భరోసా అందించబడుతుంది. ఇది దీర్ఘకాలిక, స్థిరమైన కెరీర్‌లకు పునాది వేస్తుంది.
“ఈ కేంద్రం ప్రారంభించడం ద్వారా వీలైనంత ఎక్కువ మంది యువతను నేటి ఉద్యోగ రంగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తుంది. ఈ కేంద్రాన్ని(Center) ఏర్పాటు చేయడంలో ఉదార మద్దతు ఇచ్చినందుకు కెప్టెన్ సుబ్బారావు ప్రభలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయనతో భాగస్వామ్యం చేసుకోవడాన్నిగౌరవంగా ఉన్నతి భావిస్తోంది ” అని ఉన్నతి ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ స్వామి అన్నారు.
ఈ కార్యక్రమంపై తన ఆలోచనలను కెప్టెన్ ప్రభల వెల్లడిస్తూ.. “ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు అపారమైన సామర్థ్యం ఉంది కానీ అర్థవంతమైన ఉపాధిని పొందడానికి విద్య ఒక్కటి మాత్రమే ఎల్లప్పుడూ సరిపోదు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ఉన్నతికి మద్దతు ఇవ్వడం ద్వారా కాకినాడ( Kakinada) యువతకు వారి స్వంత కాళ్ళపై వారు నిలబడటానికి, సమాజానికి గౌరవంగా సేవ చేయడానికి సహాయపడేలా అవకాశాలను పొందేలా చేయటానికి ఇది మా వినయపూర్వక సహకారం” అని అన్నారు.
ఉన్నతి శిక్షణా కేంద్రాలు, కాకినాడలోని UNXT యువతకు వివిధ రంగాలలో ప్రవేశ దశ ప్రొఫెషనల్ ఉద్యోగాలను పొందేందుకు వీలు కల్పించాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, భీమా (BFSI)లో బిజినెస్ అసోసియేట్‌లుగా చాలా మంది నియమించబడ్డారు. మరికొందరు బీపీఓ, టెలికాలింగ్(Telecalling) కార్యకలాపాలలో చేరారు.
చిన్న పట్టణాల్లో మంచి జీతం ఉన్న ఉద్యోగ అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి. కొన్ని కంపెనీలలో ఒకే తరహా ఉద్యోగాలు ఉండటంతో పాటుగా తాజా గ్రాడ్యుయేట్ల కంటే అనుభవజ్ఞులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. పట్టణ, మెట్రోపాలిటన్ నగరాల్లోని నియామకాలకు యువతను అనుసంధానించడం ద్వారా విస్తృత శ్రేణి ఉద్యోగాలకు మెరుగైన జీతం, ప్రయోజనాలకు, కెరీర్ వృద్ధికి, అధునాతన సాంకేతికతలకు చేరువ అయ్యే అవకాశాన్నిఉన్నతి కల్పిస్తుంది.
ఐటీఐలు ప్రభుత్వ కళాశాలల్లో శిక్షణ నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థతో కలిసి ఉన్నతి ఫౌండేషన్ పనిచేస్తుంది. ఒక్క కాకినాడలోనే 5-6 కళాశాలల(Colleges)తో ఉన్నతి భాగస్వామ్యం కలిగి ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 29,000 కంటే ఎక్కువ మంది యువత దాని కార్యక్రమాల నుండి ప్రయోజనం పొందారని కెప్టెన్ సుబ్బారావు తెలియజేశారు.