వెల్లువెత్తిన నిరసనలు..
- మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దగ్ధం
ఆంధ్రప్రభ (ధర్మపురి) : ఇటీవల హైదరాబాద్ లో ఒక సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ ధర్మపురి మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) పై చేసిన వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని లేకుంటే దళిత వర్గాల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ములుగురి రమేష్, చిలుముల లక్ష్మణ్, బొల్లారుపు పోచయ్య, రాయిల్లా రవి, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

