13వ‌ర‌కూ ప్ర‌వేశాలు

మెద‌క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బీఈడీ అడ్మిష‌న్లు ప్రారంభ‌మ‌య్యాయి. టీజీ ఈడీ సీఈటీ కన్వీనర్ జారీ చేసిన ఆదేశాల మేర‌కు ఈ నెల 13 వ‌తేదీ వ‌ర‌కూ ప్ర‌వేశాలు ఉంటాయ‌ని మెదక్ జిల్లా నార్సింగి కె. నారాయణ మెమోరియల్ డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్‌ కేశవ నారాయణ తెలిపారు. 3/9 2025 నుండి 13l 10/ 2025 వరకు అడ్మిషన్స్ పొడిగింపబడ్డాయని తెలిపారు. ఈ విష‌యాన్ని విద్యార్థులు గ‌మ‌నించి అవకాశమని ఉపయోగించుకోవాలని కోరారు. నార్సింగి కె నారాయణ మెమోరియల్ డైట్ కాలేజీలో 20 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు.

Leave a Reply