అక్టోబర్ 1న సీఎం ప్రోగ్రామ్ సందడి

(విజయనగరం, ఆంధ్ర ప్రభ): అక్టోబర్ 1న జిల్లాలోని దత్తి రాజేరు మండలంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) పర్యటన నేపథ్యంలో ఏర్పాట్ల సన్నద్ధంలో అధికారులు బిజీబిజీ అయ్యారు. జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి (Collector Ram Sundar Reddy, జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ సోమవారం పరిశీలించారు.

హెలిప్యాడ్ (Helipad), ప్రజా వేదిక, పార్కింగ్ స్థలాలను పరిశీలించిన కలెక్టర్ బాధ్యులకు తగు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉన్నందున ఆమేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జేసీ సేదు మాధవన్ ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply