గుండెపోటుతో మృతి
విజయవాడలో విషాదం
దసరా ఉత్సవాల్లో విధులకు హాజరు
ఆంధ్రప్రభ, పూసపాటిరేగ విజయనగరం : విజయనగరం(Vizianagaram) జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన ఎస్ ఐ 2 శ్రీనివాసరావు(Srinivasa Rao) గుండెపోటుతో మృతి చెందారు. కనకదుర్గమ్మ(Kanakadurgamma) ఉత్సవాల సందర్భంగా బందోబస్తు నిమిత్తం విజయవాడ ఆదివారం వెళ్లారు. సమీపంలోనే ఓ లాడ్జి తీసుకొని విధులకు వెళ్లి వస్తుండేవారు. సోమవారం ఉదయం అదే లాడ్జిలో(at the lodge) బాత్రూంలో విగత జీవిలా పడి ఉన్నఎస్సైని అక్కడి జనం ఆయనను చూసి పోలీసుల(Police)కు సమాచారం అందించారు.
తమకు వచ్చిన సమాచారం మేరకు ఎస్సై శ్రీనివాసు గుండెపోటు(Heart Attack)తోనే మరణించినట్లు తెలిసిందని పూసపాటిరేగ ఎస్సై 1 దుర్గాప్రసాద్(SI 1 Durgaprasad) విలేకరులకు తెలిపారు. ఆయన భార్య ఇటీవల మృతి చెందారని, కుమారుడు కుమార్తె ఉన్నారనీ తెలుస్తోంది. వీరిది అనకాపల్లి జిల్లా కాగా, రాకపోకలకు దూరమని పూసపాటిరేగలోనే ఉంటూ తన విధులకు హాజరయ్యారని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.