బట్వాన్ పల్లిలో నిరసన
మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : తమను మోసం చేసిన వారి పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి గ్రామంలో వడ్డెర సామాజికవర్గం ప్రజలు నిరసన చేపట్టారు. వారు నిన్న రాత్రి నుంచి ఉదయం వరకూ ఆందోళన చేశారు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారికి బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి గ్రామంలో ఉన్న కొందరు మోసం చేశారు. తాండూర్ మండలంలో 12 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు చూపించి బాధితుల వద్ద నుంచి 45 లక్షలు తీసుకొని తప్పించుకు తిరుగుతున్నారని వారు ఆరోపించారు. డబ్బులు చెల్లించి రెండు నెలలు గడుస్తున్నా భూమి అమ్మకానికి పెట్టిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ కు రాలేదని బాధితులు తెలిపారు. వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.