ఫ్యాన్స్ డిమాండ్ మేర‌కు …

పవన్ కల్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘ఓజీ’ (OG) బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలో అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు మేక‌ర్స్.

ప్రేక్షకుల నుండి వస్తున్న బలమైన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, నేహా శెట్టి చేసిన స్పెష‌ల్ సాంగ్ ను సినిమాలో చేర్చాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ పాట రేపటినుంచే థియేటర్లలో ప్రదర్శించే చాన్స్ ఉంది.

నిజానికి, థియేట్రికల్ రిలీజ్ ముందు సినిమా రిథమ్‌కు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో మొదట చిత్రీకరించిన ఈ స్పెషల్ సాంగ్‌ను తొలగించడం జరిగింది. అయినప్పటికీ, ఈ పాటను విడుదల చేయాలని అభిమానులు కోరడంతో, చిత్రబృందం దీనిని సినిమా రెండో భాగంలో చేర్చాలని నిర్ణయించింది.

ఈ విషయంపై సంగీత దర్శకుడు థమన్ స్పందిస్తూ, “ఈ పాట సినిమా ఫ్లోకి ఆటంకం కలిగిస్తుందని భావించి తొలగించాం. ఇప్పుడు దాన్ని కొత్త పద్ధతిలో, కొత్త దృక్కోణంతో మళ్లీ చూపించడానికి మార్గం దొరికింది” అని తెలిపారు.

‘ఓజీ’ చిత్రబృందం తీసుకున్న ఈ నిర్ణయం సినిమాకు మరింత పాజిటివ్ బజ్ తీసుకురానుంది. దసరా హాలిడే సీజన్‌లో అభిమానులు ఈ పాటను చూడటానికి మళ్లీ థియేటర్లను సందర్శించే అవకాశం ఉండటంతో, ఇది సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపై కూడా కచ్చితంగా మంచి ప్రభావం చూపనుంది.

Leave a Reply