ఏటీసీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ఏటీసీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌స్తుతం ఉద్యోగం కావాలంటే నైపుణ్యం తప్పనిసరి అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఈ రోజు మేడ్చల్ జిల్లా మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(Advanced Technology Center) (ఏటీసీ)ను ఆయ‌న‌ ప్రారంభించారు. టాటా టెక్నాలజీస్ వారి సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీ(ATC)లను వర్చువల్‌గా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ.. 2047కు మూడు మిలియన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరాలని ఆకాంక్షించారు. దేశంలో రెండున్నర‌ శాతంగా ఉన్నా మనం ఐదు శాతం జీడీపీని దేశానికి అందజేస్తున్నామని అన్నారు.

రాబోయే రోజుల్లో 5 శాతం జీడీపీ(GDP)ని 10 శాతానికి పెంచేందుకు తెలంగాణాన్నిఅభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అనంతరం దావోస్ పర్యటనలో భాగంగా అక్కడ టాటా టెక్నాలజీస్ సంస్థతో చర్చలు జరిపామని తెలిపారు.

రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు ఉన్నా.. యువతలో నైపుణ్యం లేదని విషయం తమ దృష్టి వచ్చిందని అన్నారు. హైదరాబాద్ వచ్చాక చదువుతో పాటు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్రం(State)లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు ఆలోచన చేశామని అన్నారు. ట్రైనింగ్ సెంటర్ల(Training Centers)లో శిక్షణ పొందిన 90 శాతం మందికి ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు. త్వరలో మరో 53 ఏటీసీలను పెడుతున్నాయని స్పష్టం చేశారు.

నైపుణ్యం లేకుండా ఇంజినీరింగ్ పట్టా ఉన్నాఏమాత్రం ఉపయోగం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్కిల్, స్పోర్ట్స్(Skill, Sports) యూనివర్సిటీల ఏర్పాటు మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కార్ యువతను పట్టించుకోకుండా గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. యువతలో నైపుణ్యం ఉంటే దేశాలన్నీ మన మందు మోకరిల్లుతాయని కామెంట్ చేశారు.

తలరాతలు మారలంటే చదువు ఒక్కటే మార్గమని.. అదరికీ ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. స్కిలు లేకపోవడంతో యువతకు ఉద్యోగాలు రాక చెడు వ్యసనాలకు బానినలు అవుతున్నారని, గంజాయి కేసులు పెరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంజాయ అలవాటు నుంచి అమ్మకందారులుగా మారుతున్నారని తెలిపారు. ఒకప్పుడు ఐటీఐలో చదివితే అప్రంటీస్‌గా తీసుకునే వారని అన్నారు.

ఇక నుంచి యువతను ఆర్టీసీలో అప్రంటీస్‌లు(Apprentices)గా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటీసీ విద్యార్థికి స్కాలర్‌షిప్(Scholarship) అందిస్తామని.. ట్రైనింగ్ తీసుకునే విద్యార్థికి ప్రతినెలా రూ.2 వేలు ఇస్తాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply