మిద్దె కూలి అనంత‌లోకాల‌కు!

మిద్దె కూలి అనంత‌లోకాల‌కు!

మక్తల్, ఆంధ్రప్రభ : ఓ బాలుడు ఆడుకుంటుండుగా ఒక్క‌సారిగా మిద్దె కూలింది. ఆ మ‌ట్టి పెల్ల‌లు ప‌డిపోవ‌డంతో ప‌దేళ్ల బాలుడు మృత్యువాత ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న ఈ రోజు ఉద‌యం నారాయ‌ణ‌పేట జిల్లా మ‌క్త‌ల్(Maktal) మండ‌లం అనుగొండ( Anugonda) గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దుర్ఘ‌ట‌న‌తో ఆ గ్రామంలో విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి.

గ్రామానికి చెందిన సురేష్ జమునల(Suresh Jamunala) కుమారుడు ఆదిత్య(Aditya) (10) ఇంటి పక్కనే ఉన్న పాడుబడిన మట్టి మిద్దెల్లోకి వెళ్లి ఆడుకుంటుండగా ఉన్నట్టుండి గోడ కూలి మిద్దె కూలిపోవడంతో బాలుడు పై పడి గాయాల పాలయ్యాడు.

వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని మక్తల్ ఆస్పత్రికి(to the hospital) తీసుకువస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అప్పటివరకు ఆడుకుంటూ ఉన్న బాలుడు ప్రమాదవశాత్తు మిద్దె కూలి మృతి చెందడంతో అనుగొండ గ్రామంలో విషాదఛాయ‌లు(sad shadows) అలుముకున్నాయి. జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్నవర్షాలకు తడిసి ముద్దైన మట్టి మిద్దె కూలింద‌ని స్థానికులు చెబుతున్నారు.

Leave a Reply