ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద మూసీ నది ఉగ్రరూపంలో ప్రవహిస్తుంది. బ్రిడ్జి పై సుమారు 10 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ బ్రిడ్జి, దోబీ ఘాట్, జలమయమైన పెట్రోల్ బంక్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితిని సమీక్షించారు. నిన్న సాయంత్రం నుంచే మూసీ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, లోతట్టు ప్రాంతాల వారిని రిహాబిలిటేటెడ్ సెంటర్లకు తరలించాలని పేర్కొన్నారు.
ఆరు రిహాబిలిటేటెడ్ సెంటర్లలో 1,083 మందికి ఆ శిక్షణలు, భోజన సదుపాయాలు, తాత్కాలిక నివాస ఏర్పాట్లు కల్పించబడ్డాయి. చాదర్ ఘాట్ వద్ద అక్కడే ఉండిపోయిన కొందరిని హైడ్రా, DRF సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కూడా ముసారాంబాగ్ బ్రిడ్జీ దగ్గర పరిస్థితిని పరిశీలించారు. వరద ప్రవాహాన్ని తట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వికారాబాద్ ప్రాంతంలో కూడా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి కొనసాగుతోంది.