6 వేల కెమెరాలు సిద్ధం

  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ
  • క్వాంటమ్ రెడీ అనలిటిక్స్
  • మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ
  • 3 డి మ్యాపింగ్.. రెడ్ స్పాట్లకు చెక్
  • అన్నీ ఆలయాల్లో ఐసీసీసీ వాడండి
  • తిరుమలతో సీఎం చంద్రబాబు సూచన


( తిరుమల ప్రతినిధి, ఆంధ్రప్రభ) : తిరుమల వేంకటేశ్వర స్వామి (Tirumala Venkateswara Swamy)ని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ , సీఎం చంద్రబాబు నాయుడు. వీరిద్దరికీ స్వామి ప్రసాదాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ అందజేశారు. అనంతరం భక్తుల వసతి సౌకర్యం కోసం నూతనంగా నిర్మించిన పిలిగ్రిమ్స్ అమ్నెటీస్ కాంప్లెక్స్-5 ను ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి ప్రారంభించారు. తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (Integrated Command Control Center) ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించగా.. కమాండ్ కంట్రోల్ సెంటర్ పని తీరును అధికారులు వివరించారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), క్వాంటమ్ రెడీ అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో ఈ అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ పని చేస్తుందని అధికారులు తెలిపారు. 6 వేల సీసీ కెమెరాల సాయంతో 3 డి మ్యాపింగ్, రెడ్ స్పాట్లను గుర్తించి రద్దీ నివారణకు ఐసీసీ సెంటర్ ఉపయోపడుతుందన్నారు.

అలిపిరి (Alipiri) నుంచి తిరుమల వరకూ భక్తుల రద్దీ, క్యూలైన్ల నిర్వహణతో పాటు టెక్నాలజీ సాయంతో స్వామీ దర్శనం జరిగేలా ఎప్పటికప్పుడు సూచనలు ఐసీసీ సెంటర్ సూచనలు చేస్తుంది. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు శ్రీవారి వైభవం తెలియ చెప్పేలా వీడియోలు ప్రదర్శించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. టీటీడీ నిర్వహణలోని అన్ని దేవాలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించాలని సీఎం ఆదేశించారు.

Leave a Reply