40 గేట్లు ఎత్తి గోదావ‌రిలోకి నీరు విడుద‌ల‌

40 గేట్లు ఎత్తి గోదావ‌రిలోకి నీరు విడుద‌ల‌

గోదావరిఖని, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీపాద సాగర్(Sripada Sagar) (ఎల్లంపల్లి ప్రాజెక్టు)లోకి ఈ రోజు 5,62,660 క్యూసెక్కుల నీరు వ‌ర‌ద వ‌స్తుంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టుకు సంబంధించిన వరద గేట్లు(Gates) తెరవడంతోపాటు ఎగువ ప్రాంతంలో వ‌ర్షాలు కురియ‌డంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 5,62,660 క్యూసెక్కుల నీరు చేరుతుంది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మై ప్రాజెక్టు(Project)కు సంబంధించిన 40 గేట్లను ఎత్తి గోదావ‌రిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.

  • శ్రీ‌రాంసాగ‌ర్ ప్రాజెక్టు నుంచి 3,38,440 క్యూసెక్కుల(Cusack’s) నీరు ఎల్లంప‌ల్లి ప్రాజెక్టుకు చేరుతోంది.
  • ప్రాజెక్టులో 148 అడుగులు పూర్తి నీటి మట్టం కాగా, ప్ర‌స్తుతం 147.35 అడుగుల‌కు చేరుకుంది.
  • ప్రాజెక్టులో 20.175 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి నిల్వ‌లు కాగా, ప్రస్తుతం 16.9679 టీఎంసీ(TMC)ల‌ నీరు నిల్వ ఉన్నట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు తెలిపారు.
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై(Metro Water Supply) కి 303 క్యూసెక్కుల నీరును సరఫరా చేస్తున్నారు.
  • రామగుండం ఎన్‌టీపీసీ విద్యుత్ థర్మల్(NTPC Vidyut Thermal) ప్రాజెక్టుకు నీరు సరఫరా జరుగుతుంది.

Leave a Reply