నెల్లూరు జిల్లాలో అయినా కలపండి
గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరును జిల్లా చేయండి కానిపక్షంలో నెల్లూరు(Nellore) జిల్లాలో గూడూరు ను కలపాలని నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునిల్ కుమార్ మంగళవారం అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.
గత వైసిపి ప్రభుత్వంలో గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా నుండి తిరుపతి(Tirupati) జిల్లాలో విలీనం చేయడం జరిగిందని ఈ క్రమంలో గూడూరు నియోజకవర్గ ప్రజలు వారి వారి పనుల నిమిత్తం అధికారుల(Officers)ను కలవాలన్న ఏ విషయమైనా తిరుపతికి వెళ్లాలంటే ఎంతో దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని గూడూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి తిరుపతికి వెళ్లాలంటే 150 కిలోమీటర్లు ఉంంటుందన్నారు.
భౌగోళికంగా, సామాజికంగా(social) ఈ ప్రాంతం నెల్లూరుతో అనుసంధానం అయి ఉందన్నారు. ప్రజల అభిష్టాన్ని పరిగణలోకి తీసుకోని గూడూరు(Gudur)ను జిల్లాగా చేసినా, నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపినా సంతోషమన్నారు.