మందమర్రి గనుల్లో…

కాసిపేట, ఆంధ్రప్రభ : సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టిబిజికేఎస్ ఆద్వర్యంలో కార్మికులు(workers) నల్ల బ్యాడ్జీలతో ధరించి నిరసనలు వ్యక్తం చేశారు. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి(Singareni) సంస్థ సాధించిన లాభాల పై ప్రభుత్వం నిన్న ప్రకటించిన వాటాశాతం పంపిణీపై వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. గత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ సాధించిన నికర లాభాలు రూ.6 494 కోట్లు గా పేర్కొంటూ, అందులో నుంచి సంస్థ భవిష్యత్ అభివృద్ధి పేరున రూ,4 034 కోట్లు పక్కన పెట్టి, కేవలం 2 360 కోట్ల రూపాయలకు 34 శాతం తో రూ,802.40 కోట్లు కార్మికులకు వాటా గా పంపిణీ చేయనున్నట్టు గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)లు వెల్లడి చేయడాన్ని వారు ఖండించారు.
వాస్తవ లాభాలు రూ,6 395 కోట్ల నుండి 34 శాతం చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.10 వేలు చెల్లించాలని, వాటా శాతం దసరా పండగ కు ముందు కార్మికులకు చెల్లించాలని టిబిజెకెఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమాల్లో కేంద్ర, ఏరియా, గనులు, డిపార్ట్ మెంట్ ల కు చెందిన నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
